నీట మునిగిన శరణార్థుల పడవ....ఏడుగురు మృతి

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:36 PM

నీట మునిగిన శరణార్థుల పడవ....ఏడుగురు మృతి

ఏథెన్స్‌: గ్రీకు తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. శరణార్థులకు చెందిన ఈ పడవ మునగడంతో ఏడుగురు మృతి చెందగా మరికొందరు గల్లంతయ్యారు. వివరాల ప్రకారం.....టర్కీ నుంచి గ్రీకులోని ఏజియన్స్‌ దీవులకు శరణార్థులతో బయల్దేరిన పడవ నీట మునిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు ఏడుగురు మృతి చెందారు. సహాయక బృందాలు 57 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పడవ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పరిమితికి మించి ప్రయాణీకులను పడవలో ఎక్కించుకోవడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

Untitled Document
Advertisements