'దే దే ప్యార్ దే రిమేక్' లో వెంకీ

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:53 PM

'దే దే ప్యార్ దే రిమేక్' లో వెంకీ

'ఎఫ్2' తర్వాత విక్టరీ వెంకటేష్ స్పీడు పెంచాడు. ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ సినిమా ఉంటుందని అంటున్నారు. అన్నయ్య సురేష్ బాబు కొరిక మేరకు బాలీవుడ్ రీమేక్ ‘దే దే ప్యార్’ రిమేక్ కి ఓకే చెప్పాడు. ఐతే, ఈ సినిమాని ఏ దర్శకుడు చేతిలో పెడతారన్నది ఆసక్తిగా మారింది.

శ్రీవాస్ పేరు తెరపైకి వచ్చింది. శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద , 'డిక్టేటర్', 'సాక్ష్యం' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న శ్రీవాస్ చేతిలో 'దే దే ప్యార్ దే రిమేక్' బాధ్యతలు పెట్టడం సాహసమే అంటున్నారు. ఐతే, సురేష్ బాబు అన్నీ విధాల ఆలోచిందే.. శ్రీవాస్ ని లైన్ లోకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు.

Untitled Document
Advertisements