మారుతీ కంటే అమితాబ్ బెంజ్ ధర తక్కువ...!

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:21 PM

మారుతీ కంటే అమితాబ్ బెంజ్ ధర తక్కువ...!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన మెర్సిడెస్ బెంజ్ కారును విక్రయించనున్నారు. అయితే ఈ కారు ధర మారుతీ సుజుకీకి చెందిన సియామ్ మోడల్‌ ధర కన్నా తక్కువగా ఉంది. అమితాబ్‌కు లగ్జరీ కార్లంటే భలే ఇష్టం. అందుకే ఆయన దగ్గర చాలా కార్లే ఉన్నాయి. వీటిల్లో లెక్సస్ ఎల్ఎక్స్570, మెర్సిడెస్ మేబాక్ ఎస్500, పోర్షే, బెంట్లీ కాంటినెంటల్ జీటీ, మెర్సిడెస్ బెంజ్ వీ క్లాస్, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఈయన అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్, రోల్స్ రాయిస్ కార్లు కూడా కలిగి ఉన్నారు. కొత్త కార్లు కొనేటప్పుడు పాత కార్లను విక్రయిస్తూ ఉంటారు. అమితాబ్ తన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారును గతంలోనే విక్రయించారు. అయితే ఇప్పుడు ఈ కారు మళ్లీ ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి వచ్చింది. దీని ధర రూ.9.99 లక్షలు. మారుతీ సుజుకీ సియాజ్ కన్నా ఈ ధర తక్కువ కావడం గమనార్హం. ఈ బెంజ్ కారు 2007లో తయారైంది. కారు నెంబర్ చివరిలో 5050 ఉంటుంది. అమితాబ్ ఫ్యామిలీ సిగ్నేచర్ నెంబర్ ఇది.

Untitled Document
Advertisements