భారత్ సినిమాకు భారత ఆటగాళ్ళు!

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:23 PM

భారత్ సినిమాకు భారత ఆటగాళ్ళు!

ఇంగ్లాండ్‌: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన భారత్ సినిమాను టీమిండియా ఆటగాళ్లు నాట్టింగ్‌హామ్‌లోని ఓ థియేటర్‌లో మంగళవారం వీక్షించారు. సల్మాన్‌కు వీరాభిమాని అయిన కేదార్‌ జాదవ్‌ ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆటగాళ్లతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ' 'భారత్' సినిమా చూసిన తర్వాత భారత జట్టుతో..' అని క్యాప్షన్‌ ఇచ్చారు. వీరితో పాటు టీమిండియా స్టాఫ్ సభ్యులు కూడా సినిమా చూసేందుకు వెళ్లారు. కేదార్‌ ట్వీట్‌ చూసి సల్మాన్‌ స్పందించారు. 'భారత్‌ సినిమాను వీక్షించనందుకు థాంక్యూ. మీరు ఆడబోయే మ్యాచ్‌లకు ఆల్‌ ది బెస్ట్‌. యావత్‌ భారతదేశం మీతో ఉంది' అని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements