చైనా సంచలనం: 5 జీ సెల్యులార్ టెక్నాలజీతో గాల్ బ్లాడర్ సర్జరీ

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:25 PM

చైనా సంచలనం: 5 జీ సెల్యులార్ టెక్నాలజీతో గాల్ బ్లాడర్ సర్జరీ

చైనా సాంకేతిక రంగంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. తాజాగా అక్కడ వారు మరో ఘనత సాధించారు. 10 నుంచి 100 రెట్లు అత్యంత వేగం గల డౌన్ లోడ్ స్పీడ్ తో ' వచ్ఛేతరం ' 5 జీ సెల్యులార్ టెక్నాలజీతో ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఓ రోగికి గాల్ బ్లాడర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. 200 కి. మీ. దూరం నుంచి ఓ ఆస్పత్రిలో ఇదే టెక్నాలజీని వినియోగిస్తూ.. ఆ ప్రాంతంలోని వైద్యులకు సూచనలు చేస్తూ ఈ ఆపరేషన్ చేయడం వారికే చెల్లింది. (ఈ సర్జరీనే ' లాప్రోస్కోపిక్ ఖోలిసిస్టెక్టోమీ అని కూడా వ్యవహరిస్తారు). ఉత్తర చైనా హుబీ ప్రావిన్స్ లోని గ్రామంలో ఒక రోగికి సుమారు గంటపాటు ఈ సర్జరీ జరిగింది. చైనాలోని నాలుగు టెలికాం దిగ్గజాల్లో ఒకటైన ' చైనా మొబైల్ ' 5 జీ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ఈ నెల 6 న లైసెన్సు పొందింది. ఈ టెక్నాలజీకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడంతో మొత్తం సర్జరీ ప్రక్రియ సులభతరమైంది. షియాన్ సిటీలోని తైహే ఆసుపత్రిలో గల నిపుణుల బృందానికి లైవ్ ఫీడ్ ద్వారా మొదట దీన్ని ట్రాన్స్ మిట్ చేశారు. ఈ నెట్ వర్క్ ఆలస్యం కాలేదని, ఆపరేషన్ అనంతరం పేషంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సర్జికల్ బృందం తెలిపినట్టు సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది.





Untitled Document
Advertisements