జర్దారీకి 10 రోజుల రిమాండ్‌!

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:26 PM

జర్దారీకి 10 రోజుల రిమాండ్‌!

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఆసిఫ్ అలీ జర్దారీని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జర్దారీకి కోర్టు 10 రోజుల రిమాండ్‌ను విధించింది. 63 ఏళ్ల జర్దారీ, ఆతని సోదరి కలసి చానల్ ఏర్పాటుకు నకిలీ బ్యాంకు అకౌంట్లు సృష్టించి మనీ లాండరింగ్ ద్వారా పెద్దఎత్తున నిధులు సంపాదించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌ఏబీ అధికారుల కథనం ప్రకారం..పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ, ఆతని సోదరి ఇద్దరూ కలసి నకిలీ బ్యాంకు అకౌంట్లు సృష్టించడం ద్వారా దాదాపు 150 మిలియన్ల నిధులను అక్రమంగా సంపాదించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి అరెస్టుకు సంబంధించి వారెంట్లు జారీ అయ్యాయి. అయితే నకిలీ బ్యాంకు అకౌంట్లతో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ సమగ్ర విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి జర్దారీని ఎన్‌ఏబీ నేతృత్వంలోని ఒక టీమ్ శుక్రవారంనాడు కోర్టుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జర్దారీని ప్రాథమికంగా విచారించేందుకు వీలుగా 14 రోజుల రిమాండ్‌కు పంపాలని ఎన్‌ఏబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. అయితే, దీనిని బాధితుడి తరఫున వాదించిన న్యాయవాది ఫరూక్ హెచ్ నాయెక్ వ్యతిరేకించారు. అయినా ఎన్‌ఏబీ అధికారులు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నాయకుడు జర్దారీని 14 రోజుల రిమాండ్‌కు పంపాలని ఎన్‌ఏబీ తరఫున వాదించిన న్యాయవాది ముజాఫర్ అబ్బాసీ కోర్టును అభ్యర్థించారు. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే జర్దారీ, అతని సోదరి నకలీ అకౌంట్లను సృష్టించి వందలాది మిలియన్ డాలర్ల మోసానికి తెరలేపారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి జర్దారీని అరెస్టు చేసిన నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు నిమిత్తం అతనిని రిమాండ్‌కు పంపాలని ఆయన కోర్టుకు విన్నవించారు.

Untitled Document
Advertisements