కమెడియన్ గా బిజీ అవుతోన్న వేళ....మళ్లీ హీరోగా

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:28 PM

కమెడియన్ గా  బిజీ అవుతోన్న వేళ....మళ్లీ  హీరోగా

ఇటీవల హిందీలో వచ్చిన 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రధారిగా చేసిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా ఆయుష్మాన్ అదరగొట్టేశాడు.

అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కథానాయకుడిగా చేసే ఛాన్స్ సునీల్ కి వచ్చింది. ఆయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. తన కెరియర్లో ఇదొక చెప్పుకోదగిన సినిమా అవుతుందనే ఉద్దేశంతో సునీల్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇప్పుడిప్పుడే కమెడియన్ గా మళ్లీ బిజీ అవుతోన్న సునీల్, హీరోగా మరో సినిమా చేయనున్నాడన్న మాట.

Untitled Document
Advertisements