నాకు ఆ రోల్స్ అంటేనే ఇష్టం: శ్రీముఖి

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 02:26 PM

నాకు ఆ రోల్స్ అంటేనే ఇష్టం: శ్రీముఖి

బుల్లితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్లలో అనసూయ .. రష్మీ తరువాత స్థానంలో శ్రీముఖి కనిపిస్తుంది. బుల్లితెరపై ఆమె చేసే అల్లరిని చూడటం కోసం ఆయా ప్రోగ్రామ్స్ ను ఫాలో అయ్యేవారు ఎక్కువ. అలాంటి శ్రీముఖి తాజాగా అభిమానులతో చేసిన లైవ్ చాట్ లో అనేక ప్రశ్నలకి సమాధానాలిచ్చింది.

"మొదటి నుంచి కూడా నాకు విలన్ రోల్స్ అంటే ఇష్టం. ఎందుకంటే నిజజీవితంలో నేను చాలా మంచిదానిని. కనీసం విలన్ రోల్స్ ద్వారానైనా నాలోని విలనిజాన్ని మీకు చూపించాలనే కోరిక నాలో బలంగా వుంది. విలన్ పాత్రల్లో నటనకి ఎక్కువ స్కోప్ వుంటుంది. అందువలన నటిగా నిరూపించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే విలన్ పాత్రలు చేసే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది. మరి అలాంటి అవకాశం ఆమెకిచ్చే సాహసం ఎవరు చేస్తారో చూడాలి.

Untitled Document
Advertisements