అత్యాచారానికి ప్రయత్నించిన వ్య్తకి నాలుకను కొరికిన యువతి!

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 12:24 PM

అత్యాచారానికి ప్రయత్నించిన వ్య్తకి నాలుకను కొరికిన యువతి!

దక్షిణాఫ్రికా: అత్యాచారానికి ప్రయత్నించిన ఓ వ్య్తకి నాలుకను యువతి ముక్కలయ్యేలా కొరికింది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఓ యువతి (24) ఓ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తోంది. అదే అస్సత్రి క్వార్టర్స్ లో నివసిస్తోంది. ఈనెల 10న ఆమె నిద్రబోతున్న సమయంలో ఓ పేషంట్ ఆమెపై అత్యాచార యత్నం చేయబోయాడు. ఈ క్రమంలో అతడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు సదరు డాక్టర్ అతడి నాలుకను కొరికేసింది. దీంతో అతడి నాలుక ముక్కలు ముక్కలుగా విడిపోయింది. పోలీసు అతడిపై కేసు నమోదు చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి నాలుకకు ప్లాస్టిక్ సర్జరీ చేసి, తిరిగి నాలుకను అమర్చారు. నిందితుడు కోలుకున్న అనంతరం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు.





Untitled Document
Advertisements