వారి వల్ల దేశానికి చాల నష్టం: ఇమ్రాన్

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 01:33 PM

వారి వల్ల దేశానికి చాల నష్టం: ఇమ్రాన్

ఇస్లామాబాద్‌: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో అక్రమాలు, అవినీతికి పాల్పడే వారిపై తన పంజా విసిరాడు. ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు దశాబ్ద కాలంలో రూ 24 లక్షల కోట్ల విలువైన రుణాలు ఎలా తీసుకున్నాయో.. తద్వారా దేశం ఎలా దివాళా తీసిందో తేల్చేందుకు తన సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమీషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్యం మాటున ఆశ్రయం కోరే ఇలాంటి శక్తులకు ఎలాంటి ప్రోటోకాల్‌ పాటించబోమని ఇమ్రాన్‌ స్పష్టం చేశారు. పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రతిపక్ష నేత హజ్మా షాహబాజ్‌, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ తదితరుల అరెస్టు నేపథ్యంలో ఇమ్రాన్‌ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.





Untitled Document
Advertisements