మళ్ళీ క్షీణించిన ఇంధన ధరలు

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 02:31 PM

మళ్ళీ క్షీణించిన ఇంధన ధరలు

గురువారం దేశీయ ఇంధన ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 7 పైసలు క్షీణించింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.74.77కు, డీజిల్ ధర రూ.70.11కు తగ్గింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గుదలతో రూ.70.35కు, డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.64.33కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 8 పైసలు తగ్గుదలతో రూ.76.04కు, డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.67.45కు దిగొచ్చింది.





Untitled Document
Advertisements