భారత్‌లో లాంచ్ కానున్న వివో జడ్1 ప్రో

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 02:32 PM

భారత్‌లో లాంచ్ కానున్న వివో జడ్1 ప్రో

ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వివో తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. జెడ్ సిరీస్లో భాగంగా వివో జెడ్1 ప్రో ఫోన్‌ను లాంచ్ చేయనుంది కంపెనీ. వివో జడ్1 ప్రో స్మార్ట్‌ఫోన్ తొలిగా భారత్ మార్కెట్‌లోకే రానుంది. కంపెనీ ఈ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించింది. ఇందులో ఇన్‌డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా (16 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.53 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు ర్యామ్, రియర్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చనే అంచనా. ఇన్‌డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో శాంసంగ్ ఇప్పటికే పలు మొబైల్స్‌ను లాంచ్ చేసింది.





Untitled Document
Advertisements