బీఎస్ఎన్ఎల్ అభినందన్ 151 రీచార్జ్ ప్లాన్

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 04:35 PM

బీఎస్ఎన్ఎల్ అభినందన్ 151 రీచార్జ్ ప్లాన్

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో ప్రిపెయిడ్ వినియోగదారుల కోసం మరో కొత్త రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ పేరు అభినందన్ 151. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్ సదుపాయం ఉంది. రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్రయోజనాలు అన్నీ కేవలం 24 రోజులు మాత్రమే పొందగలం. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు. ప్లాన్ ధర రూ.151. ఈ రూ.151 ప్లాన్ కేవలం 90 రోజులు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉండనుంది. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ ఈ ప్లాన్ లాంచ్ చేసింది.





Untitled Document
Advertisements