అట్లాంటాలో బిజేపీ విజయోత్సవ వేడుకలు

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 04:52 PM

అట్లాంటాలో బిజేపీ విజయోత్సవ వేడుకలు

సార్వత్రిక ఎన్నికల్లో బిజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ రెండో సారి భారత ప్రధానిగా భాద్యతలు స్వీకరించారు. అయితే ఈ విజయాన్ని విదేశాల్లో కూడా వేడుకగా జరుపుకుంటున్నారు. తాజాగా అట్లాంటాలో ఆ పార్టీ అభిమానులు విజయోత్సవాలు జరుపుకున్నారు. వరుసగా రెండోసారి.. మోదీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారంటూ సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.





Untitled Document
Advertisements