ఇంటర్నెట్‌లో 86% ఫేక్ వార్తలే!

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 06:06 PM

ఇంటర్నెట్‌లో 86%  ఫేక్ వార్తలే!

ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంత వేగంగా దాన్ని దుర్వినియోగం కూడా చేస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన రోజుల కంటే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత సమాచారం అత్యంత వేగంగా చేరవేయబడుతోంది. కొన్ని లక్షల వెబ్‌సైట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిలో అత్యధిక వెబ్‌సైట్లు న్యూస్ ఆధారితమైనవే. అలాగే సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వచ్చాక ఈ సమాచార మార్పిడి మరింత వేగవంతమైంది. అయితే ఇంటర్నెట్‌లో వస్తున్న వార్తల్లో 86 శాతం ఫేక్ వార్తలే అంటున్నారు. అందులో అత్యధిక సమాచారం ఫేస్‌బుక్ ద్వారానే వ్యాప్తి చెందుతోందని ఒక సర్వేలో వెల్లడైంది. సోషల్ మీడియా యాక్టివిటీస్‌ మీద చేసిన సర్వేలో ఈ నగ్న సత్యాలు బహిర్గతమయ్యాయి.ఇంటర్నెట్ ద్వారా ప్రభావితం అవుతున్న రంగాల్లో రాజకీయాలే ప్రధానమైనవి అని కూడా ఈ సర్వే తేల్చింది. ఆ తర్వాత ఆర్థిక రంగం ఉందట. ఇక ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువగా అమెరికాలో వ్యాప్తి చెందుతుందని ఈ సర్వేలో తేలింది.ఈజిప్టు దేశీయులు ఇంటర్నెట్‌లో వచ్చే వార్తలను వెంటనే నమ్మేస్తుంటే.. పాకిస్తాన్ వాళ్లు మాత్రం ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొన్న తర్వాతే నమ్ముతున్నారంటా. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది యూజర్లను వెరిఫై చేసిన తర్వాత ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్లు సదరు కంపెనీ తెలియజేసింది.





Untitled Document
Advertisements