అమెరికాకు జులియన్‌ అసాంజేను అప్పగించిన బ్రిటన్‌

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 07:03 PM

అమెరికాకు జులియన్‌ అసాంజేను అప్పగించిన బ్రిటన్‌

లండన్‌: వికీలీక్స్‌ సహవ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజే ప్రస్తుతం యూకేలోని జైలులో ఉంటూ న్యాయవిచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయనను అమెరికాకు అప్పగించడానికి బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్‌ హ్యాకింగ్‌ ఆరోపణలపై విచారణ కోసం ఆ దేశానికి పంపేందుకుగానూ హోం శాఖ కార్యదర్శి సాజిద్‌ జావెద్‌.. ఇందుకు సంబంధించిన పత్రంపై సంతకం చేశారు.ఈ పత్రంపై ఆయన సంతకం చేయడంతో అసాంజేను అమెరికాకు పంపడంలో మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు. ఆయన పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అమెరికాలో ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కీలక పత్రాలను ఆయన లీక్‌ చేశారని, ప్రభుత్వానికి చెందిన ఓ కంప్యూటర్‌ను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నాలు జరిపారని అమెరికా చెబుతోంది.





Untitled Document
Advertisements