గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 12:47 PM

గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ

దేశంలో వాహన కొనుగోలుదారులు తగ్గిపోయారు. దీంతో ప్రముఖ వాహన తయరీ కంపెనీలు కూడా తమ వాహన ఉత్పత్తిని క్రమంగా నిలిపివేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతోందని స్పష్టంగా కనిపిస్తుంది. 2019 జూన్ నెల గణాంకాలను గమనిస్తే.. దాదాపు 5 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు డీలర్ల వద్ద అలాగే ఉండిపోయాయి. వీటి విలువ రూ.35,000 కోట్లు ఉండొచ్చనే అంచనా. టూవీలర్ విభాగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమ్మకానికి నోచుకోకుండా 30 లక్షల యూనిట్ల వాహనాలు మిగిలిపోయాయి. వీటి విలువ రూ.17,000 కోట్లు ఉండొచ్చు. మొత్తంగా చూస్తే రూ.52 వేల కోట్ల విలువైన సరుకు డీలర్ల వద్ద పేరుకుపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రతికూల అంశం. ద్రవ్యలభ్యత తగ్గిపోవడం, ఉద్యోగాల కల్పన నెమ్మదించడం, కొనుగోలు సెంటిమెంట్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు వాహన పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్, హండా కార్స్ వంటి కంపెనీలు వాహన తయారీని మధ్యమధ్యలో నిలిపివేస్తున్నాయి. నిస్సాన్, స్కోడా వంటి కంపెనీలదీ కూడా ఇదే దారి.





Untitled Document
Advertisements