రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోఘనత

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 12:48 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోఘనత

దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోఘనత సాధించింది. ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్ట్స్ రూపొందించిన ప్రపంచపు 2,000 అతిపెద్ద పబ్లిక్ కంపెనీ జాబితాలో స్థానం దక్కించుకుంది. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మాత్రమే కాకుండా దాదాపు ఇంకా 56 కంపెనీలు ఈ జాబితాలో స్థానం పొందాయి. జాబితాలో ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) అగ్రస్థానంలో ఉంది. ఈ బ్యాంక్ టాప్‌లో ఉంటూ రావడం ఇది వరుసగా ఏడోసారి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ 71వ స్థానంలో నిలిచింది. దేశీ కంపెనీల ర్యాంకుల ఆధారంగా చూస్తే ఇదే టాప్‌లో ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ విభాగంలో రిలయన్స్ 11వ స్థానంలో ఉంది. రాయల్ డాషే షెల్ టాప్‌లో ఉంది. ఇక కన్సూమర్ ఫైనాన్షియల్ రంగంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ అగ్రస్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ 7వ స్థానం దక్కించుకుంది. 2,000 జాబితాలో 332వ స్థానంలో ఉంది.





Untitled Document
Advertisements