చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ ని వేధిస్తున్న 10 మంది అరెస్టు

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 02:46 PM

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు సినీ నటుడు కల్యాణ్ దేవ్‌ను వేధిస్తున్న పది మంది పోకిరీలను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్‌దేవ్‌‌పై కొందరు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేదిస్తున్నారు.ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువ కావడంతో కల్యాణ్‌దేవ్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇన్‌స్టగ్రామ్ యాజమాన్యంతో కలిసి వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించారు. పక్కా ఆధారాలు సేకరించి పది మంది పోకిరీలను అరెస్ట్ చేసి, సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ‘విజేత’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన కల్యాణ్‌దేవ్.. తన నటతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో సినిమా చేస్తున్నారు.





Untitled Document
Advertisements