మాటల్లేవ్!

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 03:10 PM

మాటల్లేవ్!

బిష్కెక్‌: కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్ లో 13, 14 తేదీల్లో జరుగునున్న శాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ కు వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత్‌ ప్రధాని మోది, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా హజరయ్యారు. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా మోది ఇదే విధంగా అంశాలపై చర్చించుకున్నారు. అయితే పాక్‌ ప్రధానితో తప్ప అన్ని దేశాధినేతలతో మోది మాటలు కలిపారు. సమావేశం అనంతరం కిర్గిస్థాన్‌ అధ్యక్షుడు సూరన్‌బే జీన్‌బెకోవ్‌ నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఇక్కడ మోది, ఇమ్రాన్‌ కలిసి కూర్చోలేదని, కనీసం కుశల ప్రశ్నలు కూడా వేసుకోలేదని ఓ ఆంగ్ల మీడియా సమాచారం. దీంతో వీరిద్దరి గురించి అక్కడి నేతల మధ్య చర్చ కూడా వచ్చింది. ఎస్‌సిఓ వేదికగా మోది అన్ని దేశాల నేతలతో సమావేశమవుతున్నారు. కానీ ఇమ్రాన్‌ ఖాన్‌తో మాత్రం భేటీ లేనట్లేనని తెలుస్తుంది.





Untitled Document
Advertisements