రాజ్ తరణ్ ప్రియురాలి వివరాలు లీక్

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 03:21 PM

రాజ్ తరణ్ ప్రియురాలి వివరాలు లీక్

హీరో రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజ్ తరుణ్ నే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల అభిమానులతో చిట్ చాట్ చేసిన రాజ్ తరుణ్.. ప్రేమలో ఉన్నారా ? అంటే అవునని సమాధానం ఇచ్చారు. మరీ.. మీ అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేస్తారని అడిగితే.. త్వరలోనే అన్నారు.

ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ చేసుకోబోయే అమ్మాయి సినీ ఇండస్ట్రీకి చెందినదై ఉంటుందనే ప్రచారం జరిగింది. ఐతే, ఆ ప్రచారనికి పులిస్టాప్ పెడుతూ రాజ్ తరణ్ ప్రియురాలు వివరాలు కొన్ని వెల్లడించారు. విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. సాధారణ కుటుంబంలో పెరిగిన అమ్మాయి. ఆమెకు సినీ పరిశ్రమతో ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు. ఆరేళ్ల క్రిందట నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు తెలిసింది.





Untitled Document
Advertisements