దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 04:23 PM

దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె

సోమవారం దేశవ్యాప్తంగా సమ్మె చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. డాక్టర్ల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. కోల్ కతాలో జూనియర్ డాక్టర్లపై దాడులకు నిరసనగా ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్టు ఐఎంఏ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 10న ఓ జూడాపై దాడి జరిగింది. ఈ సంఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు.

అయితే, వారి డిమాండ్లను సీఎం మమతా బెనర్జీ పట్టించుకోకపోగా, అల్టిమేటం జారీ చేశారు. విధులకు హాజరుకాని పక్షంలో హాస్టళ్ల నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతో జూడాలు మరింత రెచ్చిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను కొనసాగించారు. అంతేకాకుండా, విధులకు హాజరైన కొందరు జూడాలు హెల్మెట్లు ధరించి వైద్యం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements