భారత్-పాక్ మ్యాచ్...కోహ్లీకి సచిన్ సూచనలు

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 04:53 PM

భారత్-పాక్ మ్యాచ్...కోహ్లీకి సచిన్ సూచనలు

ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా జూన్ 16న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనున్న సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్ళకు మాజీ క్రికెటర్లు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో టీమిండియా కాప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు చేశాడు. ‘భారత్ బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శనే కీలకం. కాబట్టి.. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ అమీర్, వాహబ్ రియాజ్‌లు ఆరంభంలోనే ఈ ఇద్దరి వికెట్లను పడగొట్టేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నం ఫలిస్తే..? కచ్చితంగా మ్యాచ్‌‌పై పాకిస్థాన్‌‌కి ఆరంభంలోనే పట్టు దొరుకుతుంది. అందుకే.. తొలి పవర్‌ప్లే నుంచే రోహిత్, కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ.. వీలైనంత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాలి. మిగిలిన ఆటగాళ్లు.. ఈ ఇద్దరికీ సమయోచితంగా సహకరించాలి. అలా అని కోహ్లీ, రోహిత్‌లు మరీ రక్షణాత్మక ధోరణిలో ఆడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. అన్ని విభాగాల్లోనూ దుకుడుగా ఆడటాన్ని నేను సమర్థిస్తా. కానీ.. అమీర్ బౌలింగ్‌లో డిఫెన్స్ చేసినా.. ఆందోళనతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చేయండి’ అని సచిన్ సూచించాడు.





Untitled Document
Advertisements