మళ్లీ ట్రాక్ లోకి రకుల్ ప్రీత్

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 06:54 PM

ఈమధ్య కెరియర్ లో కాస్త వెనుకపడినట్టు అనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ ఊపందుకుంటుంది. మహేష్ తో స్పైడర్ తర్వాత రెండేళ్లు వెనుకపడిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మన్మథుడు 2, వెంకీమామ సినిమాల్లో నటిస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజైన దే దే ప్యార్ దే సినిమా కూడా హిట్టు అందుకోవడంతో అమ్మడికి అక్కడ కూడా క్రేజ్ పెరిగింది. ఇక తమిళంలో కూడా రకుల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.

సూర్య ఎన్.జి.కే సినిమాలో నటించిన రకుల్ విజయ్ 64వ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన 63వ సినిమా అట్లీ డైరక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే లోకేష్ భాగ్యరాజ్ డైరక్షన్ లో ఓ సినిమా ఉంటుందట. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేశారట. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో రకుల్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టే అనిపిస్తుంది.





Untitled Document
Advertisements