బిగ్ బాస్ కి షాకింగ్ న్యూస్ చెప్పిన సునీల్..

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 08:28 AM

జూలైలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజ‌న్ 3 గురించి రోజుకొక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. రెండు సీజ‌న్స్ మంచి టీఆర్పీలను బేస్ చేసుకున్న నిర్వాహకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రియాలిటి షోకి హోస్ట్ ఎవ‌రు, ఇందులో పార్టిసిపెంట్స్ ఎవ‌రు అనే దానిపై ప‌లు రకాల ఊహాగానాలు వినవ‌స్తున్నాయి. ఇందులో ఏది నిజ‌మో ఏది అబ‌ద్ధమో తెలియ‌క అభిమానులు క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సీజ‌న్ 3లో కంటెస్టెంట్‌గా కమెడీయ‌న్ నుండి హీరోగా టర్న్ తీసుకుని మళ్ళీ కమెడియన్ అయిన సునీల్‌ని తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావించి ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. అయితే త‌న‌కి రోజుకి 25 ల‌క్ష‌ల రూపాయ‌లు రెమ్యునరేషన్ ఇస్తే బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేస్తాన‌ని సునీల్‌ అన్నాడ‌ట‌. దీంతో నిర్వాహ‌కులు బిత్త‌ర‌పోయిన‌ట్టు స‌మాచారం. ఎందుకంటే బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కి రోజుకి బేసిక్ ప్యాకేజ్ ల‌క్ష‌లు రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తుండ‌గా, సునీల్ చేసిన డిమాండ్ బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌ని షాక్‌కి గురి చేసింద‌ట‌. సోష‌ల్ మీడియాలో దీనిపై విస్తృత ప్ర‌చారం జ‌ర‌గుతుండగా, ఇది ఎంత వ‌ర‌కు నిజం అనేది తెలియాల్సిది ఉంది.





Untitled Document
Advertisements