ఇదేమి ఘోరం.....మన చావు వార్త మనమే చదువుకునే రోజులు వస్తున్నాయా?

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 10:14 AM

ఇదేమి ఘోరం.....మన చావు వార్త మనమే చదువుకునే రోజులు వస్తున్నాయా?

బాలీవుడ్‌కు చెందిన ‘ఫలానా’ నటి లేదా నటుడు మరణించారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేయడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా హృతిక్ రోషన్ సోదరి సునైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు కనిపించాయి. అయితే ఇవన్నీ వదంతులేనని స్వయంగా నునైనానే మీడియాకు చెప్పుకోవలసి వచ్చింది. ఈ విధంగా గతంలో పలువురిపై వార్తలు వెలువడి, తరువాత అవి వదంతులని స్పష్టమయ్యాయి. కొన్నేళ్ల క్రితం ఐశ్వర్యరాయ్ ఆత్మహత్యకు ప్రయత్నిచారని, ఆమెకు అమితాబ్, జయాలతో వచ్చిన వివాదాలే దీనికి కారణమనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త ఉత్తదేనని తరువాత తేలింది.

అలాగే గతంలో నటి మాధురి దీక్షిత్ హార్ట్‌ఎటాక్‌తో మరణించిందనే వార్తలు వినిపించాయి. అయితే మాధురి ఈ వార్తలను ఖండిస్తూ, తాను నిక్షేపంగానే ఉన్నానని వెల్లడించారు. 2012లో అమితాబ్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. 2012లో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ వైరల్ ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరారని, పరిస్థితి విషమించి మృతి చెందారనే వార్త వచ్చింది. అయితే ఆ వార్తలో నిజం లేదని తేలింది. కాగా 2013లో కత్రీనాకైఫ్ మృతి చెందినట్లు ఫేస్‌బుక్ ద్వారా వార్త వచ్చింది.

అయితే ఇది అబ్ధమని ఆమె రిప్రజంటేటివ్ మీడియా ముందు వెల్లడించారు. ఒక యూరోపియన్ నెట్‌వర్క్ విమాన ప్రమాదంలో షారూఖ్ చనిపోయాడని ప్రకటించింది. అయితే ఈ వార్త వచ్చిన సమయంలో షారూఖ్ ముంబైలో జరుగుతున్న ఒక షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇదేవిధంగా ఆశాఫరేఖ్, ఆయుష్మాన్ ఖురానా, నానాపాటేకర్, హనీసింగ్, శక్తీకపూర్, బప్పీలహరి మొదలైన వారంతా ఇటువంటి వదంతులను ఎదుర్కొన్నారు. చివరికి ఇటువంటివన్నీ కేవలం వదంతులేనని తేలింది.





Untitled Document
Advertisements