వాట్సాప్ షాకింగ్ న్యూస్ ...రూల్స్ పాటించకపోతే జైలుకే…

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 10:15 AM

న్యూఢిల్లీ : గ్రూప్ సందేశాలపై వాట్సాప్ కీలక ప్రకటన చేసింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా తమ యాప్‌ను దుర్వినియోగ పరిస్తే జైలు తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు వాట్సాప్ నిబంధనలను సవరించింది. సంస్థలు కానీ, వ్యక్తులు కానీ పెద్ద మొతాదులో గ్రూప్ సందేశాలు పంపితే డిసెంబరు 7 నుంచి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దానిలో పేర్కొంది. ఇతరులకు సహకరించినా వాట్సాప్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది అని తన ప్రకటనలో పేర్కొంది. అయితే కంపెనీ తీసుకొనే చట్టపరమైన చర్యలు ఏంటో మాత్రం స్పష్టం చేయలేదు. ఒకేసారి గుంపుగా, ఆటోమేటెడ్ సందేశాలు పంపడం తమ యాప్ తయారీ వెనక ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో వాట్సాప్ కు 200 మిలియన్ల యూజర్లున్నారు.





Untitled Document
Advertisements