హీరో నాగశౌర్యకి తీవ్ర గాయాలు

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 10:50 AM

హీరో నాగశౌర్యకి తీవ్ర గాయాలు

టాలీవుడ్ నటుడు నాగశౌర్య గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించిన ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఓ సినిమా షూటింగ్ విశాఖలో శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుండగా నాగశౌర్య రోప్, డూప్ సాయం లేకుండా నటించారు. ఈ క్రమంలో పట్టుతప్పిన ఆయన కిందపడ్డాడు. ఎడమ కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు భయపడాల్సిన అవసరం లేదని, అయితే, మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని చెప్పినట్టు తెలుస్తోంది.





Untitled Document
Advertisements