ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:09 AM

ఒకపక్క ప్రత్యేక హోదా కోసం పోరాడతానని జగన్ చెబుతూ ఉంటె కేంద్రం మాత్రం అలాంటిది ఏమీ లేదని చెబుతూనే ఉంది. తాజాగా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ క్లారిటీ ఇచ్చారు. హోదా విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, దీనికి సరిసమానమైన సాయం ఇప్పటికే చేశామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు శుక్రవారం వచ్చిన ఆయన తిరుపతిలో ఓ ప్రయివేట్ హోటల్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిర్ణయం స్థిరంగా ఉందని, హోదాకు సరిసమానమైన సహాయం చేశామని, పునర్విభజన చట్టంలోని అంశాలకు కొన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గత ప్రభుత్వంతో పలు చర్చలు జరిపిన తర్వాత ఆమోదం పడిందని, దీన్ని అప్పటి పాలకులు ప్రశంసలు కురిపించారని కొత్త ప్రభుత్వం వాటిని అధ్యయనం చేసి, తదనుగుణంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం హోదా అంశాన్ని రాజకీయం చేయాలని చూసిందని, కొత్త ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని గోయల్ సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా పాల్గొనడం విశేషం





Untitled Document
Advertisements