డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించిన స్టార్ హీరో కూతురు

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:14 AM

డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించిన స్టార్ హీరో కూతురు

బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ గారాలపట్టీ ఇరాఖాన్ డేటింగ్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన ప్రకటన చేశారు. సంగీతకారుడు మిషాల్ కిర్పలానీతో తాను డేటింగ్ చేస్తున్నట్లు ఇరాఖాన్ ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఏదైనా అడగండి అనే కార్యక్రమంలో ఇరాఖాన్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన ప్రియుడు మిషాల్ కిర్పలానీ ఆలింగనం చేసుకున్న ఫోటోను ఇరాఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఇరాఖాన్, మిషాల్ లు గతంలోనూ తాము కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన కూతురు ఇరాఖాన్ సినిమా నిర్మాణంపై ఆసక్తిగా ఉందని గతంలో అమీర్ ఖాన్ కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో వెల్లడించారు. గత కొంతకాలంగా ఇరాఖాన్, మిషాల్ ల డేటింగ్ రూమర్లు ఆమె ప్రకటనతో నిజమయ్యాయి.





Untitled Document
Advertisements