మురుగ‌దాస్ సినిమాలో నటించాలనుకుంటున్న హాలీవుడ్ స్టార్

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:43 AM

మురుగ‌దాస్ సినిమాలో నటించాలనుకుంటున్న హాలీవుడ్ స్టార్

స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ 'ద‌ర్బార్‌' చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈయ‌న‌కు ఓ హాలీవుడ్ యాక్ట‌ర్ పెద్ద షాకే ఇచ్చారు. ఇంత‌కు మురుగ‌దాస్‌కు షాకిచ్చిన ఆ హాలీవుడ్ యాక్ట‌ర్ ఎవ‌రో కాదు.. బిల్ డ్యూక్‌. రీసెంట్‌గా మ‌హేష్‌తో సినిమా చేయాల‌నుందంటూ మెసేజ్ పోస్ట్ చేసిన బిల్ డ్యూక్ ఇప్పుడు మురుగ‌దాస్‌కు ట్వీట్ పెట్టారు.

"నాకు త‌మిళం రాదు కానీ.. మీ 'ద‌ర్బార్' సినిమాలో న‌టించాల‌ని ఉంది. ర‌జ‌నీకాంత్ సోద‌రుడిగానైనా, న‌య‌న‌తార అంకుల్‌గానైనా న‌టిస్తాను. అలాగే అనిరుధ్ మాలాంటి స్టార్స్ కోసం పాట‌ల‌ను క్రియేట్ చేస్తే బావుంటుంది. ఏమంటారు?" అంటూ బిల్ డ్యూక్ ట్వీట్ చేయ‌గా షాకైనా మురుగ‌దాస్ "సార్‌! నిజంగా మీరేనా?" అని రీట్వీట్ చేశారు.

దానికి ప్ర‌తిగా "సాధార‌ణంగా మేనేజ‌ర్స్ మా ప‌నికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటారు. కానీ మ‌న‌లాంటి ద‌ర్శ‌క నిర్మాత‌లు, న‌టీన‌టులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను మెప్పించ‌డానికి మంచి సినిమాలను అందించాల‌నే క‌ల‌లు కంటాం" అన్నారు. మ‌రి హాలీవుడ్ స్టార్ రిక్వెస్ట్‌ను మురుగ‌దాస్ ప‌ట్టించుకుంటారో లేదో చూడాలి.





Untitled Document
Advertisements