శ్రీలంకకు నేడు చావో రేవో!

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 12:02 PM

శ్రీలంకకు నేడు చావో రేవో!

లండన్: ఓవల్ స్టేడియం వేదికగా శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. శ్రీలంక సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిందే. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆది మూడింటిలో ఘన విజయం సాధించిన ఆసిస్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అరోన్ ఫించ్ సేన బలంగా కనిపిస్తోంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్, వార్నర్ అసాధారణంగా రాణించారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకొంది. వార్నర్, ఫించ్‌లు ఫామ్‌లోకి రావడం ఆస్ట్రేలియాకు శుభపరిణామంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. వార్నర్ చెలరేగితే లంక బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఫించ్ కూడా గాడిలో పడడంతో ఆస్ట్రేలియా ఓపెనింగ్ సమస్య తీరిపోయినట్టే. ఉస్మాన్ ఖ్వాజా, అలెక్స్ కారె, కౌల్టర్ నైల్, షాన్ మార్ష్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కమిన్స్, స్టార్క్, నైల్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.





Untitled Document
Advertisements