వరల్డ్ కప్ తర్వాత ధోని గురించి చెప్తా ? యువ రాజ్ తండ్రి సంచలనం

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 12:47 PM

వరల్డ్ కప్ తర్వాత ధోని గురించి చెప్తా ? యువ రాజ్ తండ్రి సంచలనం

భారత సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ జూన్ 10 న తన అంతర్జాతీయ క్రికెట్ కు ఓ హోటల్ లో వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువీ మాట్లాడుతూ... నేను తీసుకున్న నిర్ణయానికి ఇదే తగిన సమయమని భావిస్తున్నానని చెప్పారు. అలాగే తన 17 ఏళ్ళ క్రికెట్ కెరీర్‌లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, వాటి నుంచే అనేక పాఠాలు నేర్చుకొన్నానని అన్నారు. అవి తన జీవితానికి కూడా ఎంతో ఉపయోగపడ్డాయని యువరాజ్ అన్నారు. ఎంతో ప్రియమైన క్రికెట్‌కు దూరం కాబోతున్నందున యువరాజ్ భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇలా కొన్ని విషయాలు చెప్పినప్పటికీ మరిన్ని ముఖ్యమైన విషయాలు తరువాత చెప్తా అని తన ప్రసంగాన్ని ముగించాడు. అయితే ఈ మేరకు యువీ తండ్రి యోగ్ రాజ్ సింగ్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...''బిసిసిఐలో రాజకీయాలు నడుస్తున్నాయని, ఇప్పటికి ఏ భారత క్రికెటర్ కు సరైన రిటైర్మెంట్ జరగలేదని ఆరోపించాడు. అలాగే భారత దిగ్గజ క్రికెట్ ఆటగాళ్ళు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, VVS లక్షణ్ వంటి వారికి కూడా ఇలాగే మనసులో అత్యంత భాదను పెట్టుకొని తన కెరీర్ కు వీడ్కోలు పలికారు. వీరి జాబితాలో ఇప్పుడు నా కొడుకు యువీ కూడా చేరాడు''. అని చెప్పుకొచ్చాడు. అయితే వీటన్నింటికి కారణం ఒక్కటే అని, అది ఏంటో కూడా నాకు తెల్సు అని చెప్పుకొచ్చారు. కాగా మహేంద్ర సింగ్ ధోని గురించి కూడా చెప్పాల్సింది చాలా ఉందని, ప్రస్తుతం ప్రపంచకప్ లో అతను ఆడుతున్న సందర్భంగా నేనేమి మాట్లాడడం లేదని ఆ మెగా టోర్నీ అనంతరం అందరి గురించి అంతా బయట పెడుతా అని హెచ్చరించారు. ఇక ధోని కేవలం టెస్ట్ సిరీస్ కు వీడ్కోలు పలికినా మొన్నటివరకు జరిగిన టీ20 సిరీస్ లో తనని ఎంపిక చేయలేదు. ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకొని ధోని ఎంపిక చేయలేదు అని బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం ధోని ప్రపంచకప్ టోర్నీలో తమ అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు గెలుపుకు కీలక పాత్ర పోషిస్తున్నాడు.





Untitled Document
Advertisements