కేసీఆర్ ఒక వైపుకు.. జ‌గ‌న్ మ‌రోవైపు

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 01:36 PM

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దెబ్బ‌మీద దెబ్బ‌కొడుతున్నారు. ఆయ‌న అదేంటి వైఎస్ జ‌గ‌న్ గెలుపు వెన‌క కేసీఆర్ మంత్రాంగం వుంద‌ని, ఆయ‌న న‌డిపిన చాణ‌ర్యం వ‌ల్లే జ‌గ‌న్ ఏపీ ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యాన్ని సాధించాడ‌ని అన్నారు. గెలిచిన వెంట‌నే స‌తీస‌మేతంగా వైఎస్ జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కి వెళ్లి స్వ‌యంగా క‌లిసిన వేళ జ‌గ‌న్‌ని కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగ‌నం కూడా చేసుకున్నారు. అలాంటిది ఇద్ద‌రి మ‌ధ్య వైర‌మా? అనే డౌట్ స‌హ‌జంగా అంద‌రికి వ‌స్తుంది. కానీ ఇది నిజం. జ‌గ‌న్ త‌న తాజా నిర్ణ‌యాల‌తో కేసీఆర్‌ని ఇరుకున పెడుతున్నారు.

పార్టీ ఫిరాయింపు దారుల్ని చేర్చుకునేది లేద‌ని, అలా రావాల‌ని అనుకున్న వాళ్లు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి రావాల‌ని జ‌గ‌న్ చెప్ప‌డం ఆ వెంట‌నే ఆ విష‌యాల్ని ఉటంకిస్తూ సీపీఐ జాతీయ నేత నారాయ‌ణ కేసీఆర్‌పై నిప్పులు చెర‌గ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్స‌హిస్తుంటే వైఎస్ జ‌గ‌న్ మాత్రం వ్యతిరేకిస్తూ త‌న నిజాయితీని నిరూపించుకుంటున్నారు. జ‌గ‌న్‌ని చూసేనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఎండ‌గ‌ట్టారు. దీనికి తోడు తెలంగాణ‌లో ఆర్టీసీని ప్ర‌భుత్వం ప్రైవేట్ ప‌రం చేయాల‌ని పావులు క‌దుపుతుంటే ఏపీలో అందుకు భిన్నంగా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని జ‌గ‌న్ సెల‌వివ్వ‌డం కేసీఆర్ గుండెల్లో రాయిప‌డిన‌ట్ట‌యింది. ఇక్క‌డ కేసీఆర్ ఒక వైపుకు న‌డుస్తుంటే ఏపీలో జ‌గ‌న్ మ‌రోవైపు అడుగులు వేస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రిని విమ‌ర్శ‌ల పాలు చేస్తున్నారు. ఇది తెరాస నేత‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.





Untitled Document
Advertisements