ఒక గంట పరుగుకు...ఏడు గంటల జీవితకాలం

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 01:57 PM

ఒక గంట పరుగుకు...ఏడు గంటల జీవితకాలం

సాధారణంగా మంచి ఆరోగ్యం కోసం రోజు వ్యాయామం, యోగా వంటి అనేక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. రోజు ఉదయం రన్నింగ్ చేయడం, జిమ్ కు వెళ్ళడం వంటివి చేస్తూ ఉంటాం. ఈ కార్యకలాపాలు అన్నీ... మానవులని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే రన్నింగ్ చేయడం వల్ల మనం ఇంకా ఎక్కువ రోజులు జీవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట. తాజాగా అమెరికాలోని ఓ శాశ్త్రవేత్తల పరిశోధనలో తేలిందేంటంటే ఒక మనిషి సగటున ఎంత పరుగెత్తితే కనీసం అతనికి ఐదు గంటల జీవితకాలం పెరుగుతుంది అని వారు వెల్లడించారు. అలాగే ఒక గంట పరుగెత్తితే దానికి ప్రతిఫలంగా ఏడూ గంటల జీవిత కాలాన్ని మనం పొందవచ్చు. అయితే ఇది ఆరోగ్యానికి మంచి చేసే విధానం కాబట్టి మామూలుగానే దీన్ని ఎవ్వరూ పట్టించుకోరు అని కూడా వారు చివర్లో చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements