డియాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 02:01 PM

భారతదేశం సుగంధ ద్రవ్యాల భూమిగా ప్రసిద్ధి చెందిందని మనకు తెలుసు.ఈ సుగంధ ద్రవ్యాలు మన వంటలకు మంచి రుచి, సువాసనలను అందివ్వడమే కాకుండా, అనేక ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. దాల్చినచెక్క, లవంగం, ఏలకులు వంటి అనేక సుగంధద్రవ్యాలు మనకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. పురాతన ఆయుర్వేద ఔషధ విధానంలో, కొన్ని సుగంధ ద్రవ్యాలకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. దీనికి కారణం, వాటిలోని అద్భుతమైన గొప్ప ఆరోగ్య విశిష్టతలు. ఆ పద్ధతులను, ఆ పదార్థాలను ఇంకా మనం అనుసరిస్తున్నామంటే, వాటి ప్రయోజనాల గురించి వేరే చెప్పనక్కర్లేదు.
మనలో వ్యాధులకు గురవని వ్యక్తులు అంటూ ఉండరు. రోజుకో రోగం పుట్టుకొస్తున్న ఈ కాలంలో, ఒక వ్యక్తి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఆశ్చర్యం కలుగకమానని పరిస్థితుల్లో ఉన్నాము.
వీటిలో అనేక రకాల వ్యాధులు, గుర్తెరగని వ్యాధులుగానే ఉండడం మన దురదృష్టం. క్రమంగా వ్యాధి గురించిన పూర్తి అవగాహన లేని కారణంగా అనేకమంది, తక్కువ వయసులోనే ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఏదిఏమైనా ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంభించే వారు, అనారోగ్యాలకు కాసింత దూరంగానే ఉంటారు అన్నది నిజం.
ఇప్పుడు మధుమేహం గురించి తెలియని వారంటూ ఉండరు. కానీ మధుమేహానికి పూర్తిస్థాయిలో నివారణ అనేది ఉండదు, ఆ వ్యాధి లక్షణాలు మాత్రమే నియంత్రించబడతాయి.
కాబట్టి నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు జీవన శైలి, ఆహార ప్రణాళికలలో కొన్ని మార్పులు కచ్చితంగా అవసరమవుతాయి. ఈ లక్షణాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడమే కీలకమైన అంశంగా ఉంటుంది. డయాబెటిస్ వంటి వ్యాధితో జీవనం కొనసాగించడం, అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అది ఒక వ్యక్తి రోజువారీ కార్యాచరణాలకు ఆటంకం కలిగించడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారకంగా మారుతుంది.
శరీరంలో ఇన్సులిన్ స్థాయిల మితిమీరిన హెచ్చుతగ్గుల కారణంగా టైప్ -1, టైప్-2 మధుమేహాలకు దారితీస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇన్సులిన్ విడుదల అసాధారణ స్థితిగా చెప్పబడుతుంది. క్రమంగా శరీరం ఇన్సులిన్ ఉపయోగించుకునే జీవక్రియల పనితీరు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. క్రమంగా కొన్ని అవాంఛనీయ లక్షణాలతో కూడిన పరిస్థితులకు దారితీస్తుంది.
ఈ లక్షణాలు వరుసగా, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, బరువు నష్టం, అతి మూత్ర వ్యాధి, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడం, అస్పష్టమైన దృష్టి, నిరంతరమైన ఆకలి, పాదాలలో తిమ్మిరి మొదలైనవిగా ఉంటాయి.
ఈ మధుమేహం లక్షణాలకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే, ఇది ప్రమాదకరమైన పరిణామాలకు సైతం దారితీయవచ్చు. మధుమేహం చికిత్స, నియంత్రణలో భాగంగా మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహజసిద్దమైన పద్ధతులు అనుసరిస్తే కూడా తగిన ఫలితాలు ఉంటాయి.

తయారుచేసే పద్ధతి:
*ఒక గ్లాసు వేడి నీటిలో, లవంగాలను వేసి 15 నిమిషాలు ఉంచి,
తర్వాత నీటిని వడకట్టాలి. వడకట్టిన నీటిని అల్పాహారం తర్వాత ప్రతిరోజూ ఉదయం తాగాలి.
*మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఈ పద్ధతి ఉత్తమంగా పనిచేస్తుందని నిరూపితమైంది.
మధుమేహ చికిత్సా విధానం కోసం ఈ ఔషధాన్ని ప్రారంభించడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. మధుమేహానికి సూచించబడిన మందులను కూడా క్రమపద్ధ్దతిలో తీసుకుంటూ ఉండాలి. ఈ గృహనివారణా వైద్యాలు, మందులతో పాటుగా సహాయం చేస్తాయని గుర్తుంచుకోండి. దీంతో ఎటువంటి దుష్ఫ్రభావాలు ఉండవు.
* అంతేకాకుండా, వైద్యుడు సూచించిన ఆహార ప్రణాళిక, వ్యాయామ నియమాలను అనుసరించడం ముఖ్యం. ఎందుకంటే మధుమేహం పూర్తిగా ఆరోగ్యకరమైన జీవనశైలితో మాత్రమే నియంత్రించబడుతుంది.





Untitled Document
Advertisements