75% ప్రజలు మంచుని చూడనేలేదు!

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 02:11 PM

75% ప్రజలు మంచుని చూడనేలేదు!

మంచు ప్రదేశాలు అంటే దాదాపు అందరికి ఇష్టం ఉంటుంది. కాని వాటి వల్ల అనేక ప్రమాదాలు కూడా ఉంటాయి. ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నవారు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రకృతి వైపరిత్యాల వల్ల అనేక మంది ఆ మంచులోనే కూరుకుపోతారు. అలా మంచు మీద ఎంత ప్రేమ ఉందొ అంత భయం కూడా ఉంటుంది. అయితే ఈ భూమ్మీద మూడోవంతు ప్రజలు అంటే 75% వారు ఇప్పటికీ మంచును ప్రత్యక్షంగా చూడలేదు అంట. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కొంత మందికి మంచు ప్రదేశాలు ఎలా ఉంటాయో కూడా అవగాహన లేదు అని ఆ సంస్థ వెల్లడించిన నివేదికలో ప్రకటించారు.





Untitled Document
Advertisements