‘ఇస్మార్ట్ శంకర్’ రొమాన్స్ కి జిందాబాద్ అంటున్న నెటిజన్స్

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 02:55 PM

రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్, నిధి అగర్వాల్‌లపై మాల్దీవులలో చిత్రీకరిస్తున్నారు. భాస్కరభట్ల రచించిన ‘లవ్’ సాంగ్‌ను మాల్దీవుల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తుండటం విశేషం.



రీసెంట్‌గా 'జిందాబాద్' అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

మణిశర్మ ట్యూన్‌కి భాస్కర భట్ల లిరిక్స్ రాయగా, శరత్ సంతోష్, రమ్యా బెహరా పాడారు. 'జిందాబాద్ జిందాబాద్ ఎర్రాని పెదవులకి, జిందాబాద్ జిందాబాద్ కుర్రాడి చూపులకి.. దుంపా తెంచేసావే, దుమారమేదే రేపావే.. కొంపా ముంచేసావే, కల్లోల మేదో తెచ్చావే'.. అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. భాను కొరియోగ్రఫీలో రామ్, నభాలపై గోవాలో ఈ పాటను షూట్ చేసారు.

మణిశర్మ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు, దిమాక్ ఖరాబ్… అనే పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements