ఆస్ట్రేలియాపై ఫీల్డింగ్ ఎంచుకున్న లంక

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 03:58 PM

ఆస్ట్రేలియాపై ఫీల్డింగ్ ఎంచుకున్న లంక

ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కరుణరత్నె ఆస్ట్రేలియాపై ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆది మూడింటిలో ఘన విజయం సాధించిన ఆసిస్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఈ మ్యాచ్ లంకకు చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. వర్షం వల్ల రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. కివీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన లంక ప్రస్తుతం నాలుగు పాయింట్లతో కొనసాగుతోంది. రానున్న మ్యాచ్‌లు లంక కీలకంగా మారాయి. అంతేగాక ఇకపై జరిగే మ్యాచ్‌లన్నీ పెద్ద జట్లతోనే ఉండడంతో లంకకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే లంక ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయం.

Australia (Playing XI): Aaron Finch(c), David Warner, Steven Smith, Usman Khawaja, Shaun Marsh, Glenn Maxwell, Alex Carey(w), Pat Cummins, Mitchell Starc, Kane Richardson, Jason Behrendorff.

Sri Lanka (Playing XI): Dimuth Karunaratne(c), Kusal Perera(w), Lahiru Thirimanne, Kusal Mendis, Angelo Mathews, Dhananjaya de Silva, Thisara Perera, Milinda Siriwardana, Isuru Udana, Lasith Malinga, Nuwan Pradeep.





Untitled Document
Advertisements