మొన్న టాక్సీవాలా విషయంలో జరిగిందే....ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' కి జరుగుతుంది

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 04:27 PM

మొన్న టాక్సీవాలా విషయంలో జరిగిందే....ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' కి జరుగుతుంది

‘గీత గోవిందం’ కంటే ముందే విజయ్ దేవరకొండ ఓకే చేసిన చిత్రం టాక్సీవాలా. పలుమార్లు వాయిదా పడుతూ రిలీజైన టాక్సీవాలా మంచి విజయాన్ని అందుకొంది. గీత గోవిందం కంటే ముందు విజయ్ దేవరకొండ ఓకే చేసిన మరో చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా షూటింగ్ మధ్యలో కొన్నిరోజులు ఆగిపోయి.. మళ్లీ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. రషెస్ చూశాక కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాలని నిర్ణయించారట. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. ఇంకా కొన్ని సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో డియర్ కామ్రేడ్ జులై 26న రావడం కష్టమవుతుందేమోనని ప్రచారం జరుగుతొంది. టీజర్ తో సినిమా పట్ల ఆసక్తి పెంచేశారు. టీజర్ లో విజయ్ – రస్మిక లిప్ లాక్ సీన్ అదిరిపోయింది. దక్షిణాదిన అన్నీ బాషల్లో డియర్ కామ్రేడ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే రిస్క్ తీసుకోవడం లేదు. రీ షూట్స్ అయ్యాకే సినిమా విడుదల అవుతుందని చెబుతున్నారు. అది ఎప్పటికీ అవుతుందో చూడాలి.





Untitled Document
Advertisements