జెట్ సిఇఓపై సంచలన ఆరోపణలు

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 05:06 PM

జెట్ సిఇఓపై సంచలన ఆరోపణలు

రుణ ఉభిలో చిక్కుకొని సేవలను నిలిపివేసిన ప్రైవేట్ జెట్ ఎయిర్‌వేస్‌పై తాజాగా సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లుగా జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థపాకుడు నరేశ్‌ గోయల్‌ మీద తొలిసారి ఆరోపణలు వచ్చాయి. రూ.650 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఆయనకు సమన్లు జారీ చేసింది. త్వరలో నరేశ్‌ గోయల్‌ ను ఐటీశాఖ ప్రశ్నించనుందని జాతీయ మీడియా రాసిన కథనాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు పన్నులు ఎగవేసేందుకు నరేశ్‌ గోయల్‌.. దుబాయ్‌లోని దాని గ్రూప్‌ కంపెనీతో కలిసి అక్రమాలకు పాల్పడ్డాడని.. ఇందుకు దుబాయ్‌ కంపెనీకి కమిషన్‌ ముట్టినట్లుగా అసెస్‌మెంట్‌ వింగ్‌ దర్యాప్తులో తేలింది. త్వరలో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నరేష్‌ గోయల్‌ను ఆదేశించింది.





Untitled Document
Advertisements