కోహ్లీ వీడియోలు చూస్తా ?

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 05:48 PM

అదేంటి ఎప్పుడూ ఒకరి మీద ఒకరు పై చేయి సాదిద్దాం అనుకునే పాకిస్తాన్ బ్యాట్స్ మెన్, ఇండియా కెప్టెన్ కి ఆదర్శం ఎలా అవుతాడు అనుకుంటున్నారా ? అయితే ఇది చదవాల్సిందే. నిజానికి కోహ్లీ చాలా మందికి నచ్చడు, బహుశా ఆయన యాటిట్యూడ్ వలన అయ్యుండచ్చు, కానీ కోహ్లీ ట్యాలెంట్ మాత్రం ఎవరూ కాదనలేది. ఎంతో టెన్ష‌న్ పెట్టె గేమ్‌లోనూ కూల్‌గా చేజింగ్ చేసి గెలిపిస్తాడు. అలా చేసే కోహ్లీ బ్యాటింగ్ స్ట‌యిల్‌ను పాక్ బ్యాట్స్ మెన్ బాబ‌ర్ ఆజ‌మ్ నేర్చుకుంటున్నాడట. కోహ్లీ వీడియోలు చూస్తూ పాక్ బ్యాట్స్‌మెన్ బాబ‌ర్ ఆదివారం పోరుకు సిద్ధ‌మ‌వుతున్నానని, ఆయన వీడియోలు చూసి చాలా నేర్చుకున్న‌ట్లు బాబ‌రే స్వ‌యంగా ఈ విష‌యాన్ని చెప్పాడు. కోహ్లీ క్రికెట్ నైపుణ్యం త‌న‌కు న‌చ్చిన‌ట్లు తాను మ‌రింత ప‌టిష్టంగా త‌యార‌య్యేందుకు కోహ్లీ వీడియోల‌ను చూస్తున్న‌ట్లు చెప్పాడు. విరాట్ త‌ర‌హాలో మ్యాచ్ విన్న‌ర్ కావాల‌ని బాబ‌ర్ ఉవ్విళ్ళూరుతున్నాడు. మాంచెస్టర్ వేదికగా జూన్ 16(ఆదివారం) ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది.





Untitled Document
Advertisements