తీవ్ర స్థాయిలో తగ్గుముఖం పట్టిన సూచీలు

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 05:57 PM

తీవ్ర స్థాయిలో తగ్గుముఖం పట్టిన సూచీలు

న్యూఢిల్లీ: మే నెలలో టోకు ధరల సూచీ(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఇంధన ధరలు తగ్గడంతో గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 22 నెలల కనిష్ఠానికి తగ్గి 2.45 శాతానికి పరిమితమైంది. 2017 జులై తర్వాత టోకు ద్రవ్యోల్బణం ఇంత కనిష్ఠం నమోదు మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. 2017 జులైలో ఇది 1.88 శాతం గా నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.37 శాతంగా ఉండగా, మే నెలలో 6.99 శాతానికి తగ్గింది. కూరగాయల విభాగ ద్రవ్యోల్బ ణం 40.65 శాతం నుంచి 33.15 శాతానికి దిగివచ్చిది. కూరగాయల్లో ఉల్లి ధరలు మాత్రం పెరిగాయి. ఉల్లి ధరలు ఏప్రిల్‌లో 3.43 శాతంగా ఉంటే మే నెలలో 15.89 శాతానికి పెరిగాయి. ఇంధనం -విద్యు త్ విభాగ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.84 శాతంగా నమోదవ గా, మే నెలలో ఇది 0.98 శాతానికి పడిపోయింది. తయారీ ధరలు కూడా తగ్గాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.05 శాతంగా ఉంది. ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.





Untitled Document
Advertisements