భారత్‌పై విషప్రచారం చేసేందుకు పాక్ చర్యలు

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 06:05 PM

భారత్‌పై విషప్రచారం చేసేందుకు పాక్ చర్యలు

భారత్‌పై విషప్రచారం చేసేందుకు పాక్‌ భారత సరిహద్దుల్లో ఎఫ్‌ఎం ఛానళ్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అప్రమత్తమైన భారత ప్రభుత్వం సరిహద్దుల్లో ఎన్ని ఛానళ్లు చురుగ్గా పనిచేస్తున్నాయో లెక్కలు ఇవ్వమని పేర్కొంది. అలాగే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లీ, ముజఫరాబాద్‌, మిర్‌పూర్‌లలో కూడా కొత్తగా ఎఫ్‌ఎం స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇవి ఆర్‌ఎస్‌పురా, రాజౌరి, పూంచ్‌, నౌషెరా ప్రాంతాల్లో కూడా ప్రసారం అవుతున్నాయి. వీటి ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని విరివిరిగా ప్రచారం చేస్తుంది. ప్రజాదరణ పొందిన పాటలను ప్రసారం చేస్తూ మధ్యలో పాక్‌ సైన్యానికి అనుకూలంగా ఉండే అంశాలను ప్రస్తావిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు, సైన్యం చెబుతున్నాయి. వీటిల్లోని కొన్ని రేడియోస్టేషన్లను ఉగ్రసంస్థలు నిర్వహిస్తుండటం గమనార్హం. మొత్తం 15 రేడియో స్టేషన్లు చురుగ్గా పనిచేస్తున్నాయని భారత వర్గాలు గుర్తించాయి.





Untitled Document
Advertisements