అలా చేస్తే తప్పకుండా మీ అందరికి చెబుతా: నాగార్జున

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 06:38 PM

సెలబ్రిటీస్ కు సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్ల తలనొప్పి కామన్ గా మారింది. అఫిషియల్ ఎకౌంట్లను తలపించేలా ఈ ఫేక్ ఎకౌంట్స్ ఉండటంతో వారి ఫ్యాన్స్ వాటిని కూడా ఫాలో అవుతుంటారు. లేటెస్ట్ గా కింగ్ నాగార్జునకు ఈ ఫేక్ ఎకౌంట్ షాక్ తగిలింది. నాగార్జునకు కేవలం ఫేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంట్స్ మాత్రమే ఉన్నాయి. రెండిటిలో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే నాగార్జునకు ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ లేదని గుర్తించిన ఓ వ్యక్తి నాగార్జున పేరుతో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేశాడు.

నాగార్జునకు సంబంధించి పిక్స్, వీడియోస్ షేర్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆ ఎకౌంట్ గురించి పెద్దగా పట్టించుకోని నాగ్ లేటెస్ట్ గా ఆ ఫేక్ ఎకౌంట్ పై క్లారిటీ ఇచ్చాడు. తనకు కేవలం ట్విట్టర్, ఫేస్ బుక్ ఎకౌంట్స్ మాత్రమే ఉన్నాయని తనకు ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ లేదని అది క్రియేట్ చేస్తే తప్పకుండా మీ అందరికి చెబుతానని ప్రస్తుతం ఉన్న ఎకౌంట్ ఫేక్ అని తేల్చి పారేశాడు నాగార్జున. ప్రస్తుతం నాగ్ 'మన్మథుడు 2' సినిమా చేస్తున్నాడు. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ఈమధ్యనే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.





Untitled Document
Advertisements