లంకపై విజృంభించిన ఫించ్, స్మిత్....టార్గెట్ 335

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 06:53 PM

లంకపై విజృంభించిన ఫించ్, స్మిత్....టార్గెట్ 335

శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక మొదట ఇన్నింగ్స్ కు వెళ్ళిన ఆసిస్ విజృంభించి 7 వికెట్ల నష్టానికి 50 ఓవర్లో 334పరుగులు చేసింది. దీంతో లంకకు 335 భారీ పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. మొదటి 20 ఓవర్ల వరకు తడబడిన ఆసిస్ ఆటగాళ్ళు చివర్లో ఒక్కసారిగా చెలరేగారు. ఈ స్కోరు భారీగా పెరగడానికి ఆసిస్ కాప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక పాత్ర పోషించాడు. ఆలాగే స్టీవ్ స్మిత్ కూడా ముఖ్యపాత్ర పోషించాడు. ఆసిస్ ఓపెనర్లు David Warner 48బంతుల్ల్లో 26పరుగులు, Aaron Finch 132బంతుల్లో 153పరుగులు, Usman Khawaja 20బంతుల్లో 10పరుగులు, Steven Smith 59బంతుల్లో 73పరుగులు, Glenn Maxwell 25బంతుల్లో 46పరుగులు, Shaun Marsh 9బంతుల్లో 3పరుగులు, Alex Carey 3బంతుల్లో 4పరుగులు, Pat Cummins 0,పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా Mitchell Starc 4 బంతుల్లో 5 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.





Untitled Document
Advertisements