పాకిస్థాన్‌ ఆట ఎవరి అంచనాలకి అందదు!

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 06:59 PM

పాకిస్థాన్‌ ఆట ఎవరి అంచనాలకి అందదు!

వరల్డ్‌కప్ లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో మాంచెస్టర్ వేదికగా టీమిండియా తలపడనుంది. 1992 నుంచి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ జట్టే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో.. ఆదివారం కూడా టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కానీ పాకిస్థాన్‌ని తక్కువ అంచనా వేస్తే..? మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సచిన్, గంగూలీ హెచ్చరిస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికగానే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాక్ గెలుపొందిన విషయం తెలిసిందే. ‘పాక్‌పై మ్యాచ్‌లో భారత్ జట్టు జాగురతతో వ్యవహరించాలి. మేము ఫేవరెట్స్ అనే ఆలోచనతో మాత్రం మైదానంలోకి వెళ్లకూడదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ ఉదాసీనతే భారత్‌ని ముంచింది. క్రికెట్‌లోనే ఇది గొప్ప మ్యాచ్ కాబోతోంది’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘పాకిస్థాన్‌ ఆట ఎవరి అంచనాలకి అందదు. కొన్ని సమయాల్లో ఆ జట్టు చాలా ప్రమాదకారి. కాబట్టి.. టీమిండియా ఆ జట్టుని ఏమాత్రం సులువుగా తీసుకోకూడదు. మ్యాచ్‌లో భారత్ జట్టు వేసే ప్రతి అడుగూ.. ఆలోచించి.. సమీక్షించుకుని వేయాలి’ అని సచిన్ సూచించాడు. వరల్డ్‌కప్





Untitled Document
Advertisements