కడుపు కోసి బిడ్డను బయటికి తీసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్!

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 07:08 PM

కడుపు కోసి బిడ్డను బయటికి తీసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్!

వాషింగ్టన్: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై మహిళా ఓ నిండు గర్భినికి కడుపు కోట విధించింది. అమెరికాలోని షికాగో నగరంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మార్లెన్ ఒచోవా లోపేజ్(19) అనే నిండుగర్భిణి ఏప్రిల్ నెల 23 నుంచి కనిపించకుండా పోయింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆమె ఫేస్‌బుక్ చాటింగ్ వివరాలను కూపీ లాగగా అసలు విషయం తెలిసింది. మార్లెన్‌కు ఫేస్‌బుక్‌లో క్లారిజా ఫిగరోవా(46) అనే మహిళ పరిచయమైంది. పుట్టబోయే బిడ్డకు బట్టలు కొనిస్తానని చెప్పడంతో మార్లెన్.. క్లారిజా ఇంటికెళ్లింది. తర్వాత మార్లెన్‌కు, క్లారిజాకు గొడవ జరిగింది. క్లారిజా మార్లెన్‌కు బలవంతంగా డెలివరీ చేయడానికి కడుపును గట్టిగా వత్తింది. ప్రసవం కాకపోవడంతో తన భర్త, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పొట్ట కోసి మగబిడ్డను బయటికి తీసింది. తర్వాత శవాన్ని దగ్గర్లోని చెత్తకుండీలో పడేసింది. అదే రోజు.. ‘తన బిడ్డ’కు శ్వాస సరిగ్గా అందడం లేదంటూ 911కు ఎమర్జెన్సీ కాల్ చేసింది. పోలీసులు చిన్నారి ఆమె బిడ్డే అనుకుని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే క్లారిజా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో డీఎన్ఏ పరీక్షలు చేయగా, బిడ్డ తల్లి ఆమె కాదని తేలింది. మార్లెన్ మిస్సింగ్ కేసును, ఈ కేసుతో కలిపి దర్యాప్తు చేయగా మిస్టరీ వీడింది. బాబు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రసవ తేదీకంటే పక్షం రోజుల ముందే బలవంతంగా ప్రసవం చేయడంతో బాబు అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, మెదడులో రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతినడంతో చనిపోయాడని వైద్యులు చెప్పారు.





Untitled Document
Advertisements