బిగ్‌బాస్ సీజన్-3 ప్రోమో

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 10:56 AM

బిగ్‌బాస్ సీజన్ 3 ఎప్పుడు మొదలు అవుతుందా అని ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి హోస్టుగా అక్కినేని నాగార్జున వుంటారని టాక్ వినబడుతోంది. ఈ క్రమంలో ఈసారి కార్యక్రమంపై జనాల్లో ఆసక్తి నెలకొని వుంది. త్వరలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ సీజన్ 3 అఫీషియల్ ప్రోమోను స్టార్ మా యాజమాన్యం విడుదల చేసింది. అతి త్వ‌ర‌లో ప్రారంభం అవుతుంద‌ని ప్రోమో ద్వారా హింట్ ఇచ్చారు.

ప్రోమో చాలా ఇంట్రెస్టింక్‌గా వుందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక కంటెస్టెంటులుగా ప్ర‌ముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీ వుంటుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. జూలై రెండో వారంలో లేదా చివ‌రి వారంలో బిగ్ బాస్ సీజన్ 3 కార్య‌క్ర‌మం ప్రారంభమవనుందని తెలుస్తోంది. మరి సీజన్ మూడుకి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున ఏ మేరకు బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి. సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించగా నటుడు శివబాలాజీ విజేత అయ్యారు. సీజన్ 2కు నాని హోస్టుగా వ్యవహరించగా కౌశల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements