హీరో సందీప్ కిషన్‌కు గాయాలు..

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 10:59 AM

హీరో సందీప్ కిషన్‌కు సినిమా షూటింగ్‌లో గాయాలయ్యాయి. జి. నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూలులో జరుపుకొంటోంది. శనివారం షూటింగ్‌లో భాగంగా బాంబ్ బ్లాస్ట్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా సందీప్ గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సందీప్‌ను వెంటనే కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైట్ మాస్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

కాగా వారం వ్యవధిలోనే ముగ్గురు హీరోలు గాయాలపాలయ్యారు. మొన్న వరుణ్‌తేజ్‌, నిన్న నాగశౌర్య, నేడు సందీప్‌ కిషన్‌ షూటింగ్‌లో ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.





Untitled Document
Advertisements